హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగుచేయాలన్న ప్రభు త్వ లక్ష్యానికి భూమి కొరత సమస్య గా మారింది. ఆయిల్‌పామ్ సాగుకు ముందుగా విదేశాల నుంచి దిగు మతి చేసుకున్న విత్తనాలను విత్తి.. అవి మొక్కలుగా పెరిగిన తరువాత రైతులకు అందించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ విత్తనాలను మొక్కలుగా పెంచడానికి అవసర మయ్యే నర్సరీలను ఏర్పాటు చేయ డానికి రాష్ట్రంలో అనువైన ప్రభుత్వ భూములు లేకపోవడంతో ఆయిల్‌ఫెడ్ కార్పోరేషన్ సరైన నిర్ణయం తీసు కోలేకపోతుంది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రా ల్లో పామాయిల్ పంటను సాగు చేయా లని సూచించిన కేంద్రం తెలంగాణలోనూ 8.14 లక్షల ఎకరాల్లో సాగుచేయా లని సూచించింది. ఇదే సమయం లో నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించు కుంది. లక్ష్యాన్ని విధించుకున్న నేపథ్యంలో సాగుకు అవసరమైన రాయితీలు కూడా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా పామాయిల్ మొక్కల నర్సరీలకు స్థలం లేకపోవడంతో దిగుమతి చేసుకున్న విత్తనాలను ఎక్కడ పెంచాలన్న ప్రశ్నలకు సమాధానం లేదు. గతంలో విత్తనాలను ఆర్డర్ పెట్టిన రెండు నెలలలోనే ఆయా దేశాలు పంపేవి. కానీ ప్రస్తుతం నూనె గింజలకు అం తర్జా తీయంగా పెరిగిన గిరాకీతో విత్తనాలు ఆర్డర్ పెడితే అవి రావడానికి సుమారు 6 నెలల సమ యం పడు తుందని తెలుస్తోంది. దీంతో ఒకవైపు నర్సరీలకు స్థలం కొరత.. మరోవైపు విత్తనాల దిగు మతికి సమయం పడు తుండడంతో ఆయిల్‌పామ్ సాగుపై నీలినీడలు పడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాల్లో ప్రభుత్వ భూముల కోసం కార్పోరేషన్ అన్వేషిస్తోంది.
ప్రైవేటు భూముల లీజు.. 50ఎకరాలు రూ.13లక్షలు
ఆయిల్‌పామ్ మొక్కల పెంప కానికి అవసరమైన స్థలా లు అందు బాటులో లేకపోవ డంతో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పోరేషన్ పంట సాగయ్యే జిల్లాల్లో ప్రైవేటు భూములను లీజుకు తీసుకుంటోంది. ఇందు కోసం అధికంగానే డబ్బును వెచ్చి స్తోంది. ప్రస్తుత ఏడాదిలో 2021-22 14వేల ఎకరాల్లో సాగులక్ష్యాన్ని విధించుకోగా ఈ లక్ష్యాన్ని పూర్తిచేసే విధంగా కార్పోరేషన్ ప్రణాళి కలను సిద్ధం చేసి ముందుకు వెళు తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనగామ జిల్లాలో 25వేల ఎకరాల్లో పంటసాగుకు ప్రణాళికలు వేయగా..ఇక్కడ ప్రభుత్వ భూమి అందు బాటులో లేకపోవడంతో ఏడాదికి రూ.13 లక్షల ను వెచ్చిస్తూ 50 ఎకరా లను కార్పోరేషన్ లీజుకు తీసుకుంది. మహ బూబా బాద్ జిల్లా లో 70వేల ఎకరాల పంట సాగు కానున్న నేపథ్యం లో తొర్రూరులో రూ.10 లక్షలకు 50ఎకరాలు, నారా యణపేట జిల్లాలో రూ.6 లక్షలకు 20 ఎక రాలు లీజుకు తీసుకుని నర్సరీలు ఏర్పాటు చేశా రు. సిద్ధిపేట జిల్లాలో మాత్రం ములుగు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూముల్లో నుంచి 25 ఎకరాలు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఆధీనం లో ఉన్న భూముల్లో నుంచి మరో 25 ఎకరాలను నామినల్ ఛార్జీలతో ఆయిల్‌ఫెడ్ లీజుకు తీసుకుంది. గద్వాలలో ఆయిల్‌ఫెడ్‌కు సొంతంగా ఉన్న 90 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అశ్వారావుపేట, అప్పారావుపేటలోని తన భూము ల్లోనూ కార్పోరేషన్ నర్సరీలు ఏర్పాటుచేసి మొక్క లను పెంచుతోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి మినహ 30 జిల్లాల్లో పంటసాగుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
ప్రైవేటు లీజులోనూ కార్పోరేషనే ముందు
పామాయిల్ పంట సాగులో ప్రభుత్వ లక్ష్యా న్ని చేరుకునేందుకు ఆయి ల్‌ఫెడ్ కార్పోరేషన్ శర వేగంగా అడు గులేస్తుంది. ఇందులో భాగంగా అనుకున్న సమ యానికి రైతులకు మొక్కలను అందిం చేందు కు ప్రైవేటులోనూ భూములను లీజుకు తీసుకుం టోంది. ఇప్పటికే మూడు జిల్లాల్లో ప్రైవేటులో రూ.29 లక్షలతో 120 ఎకరాలు లీజుకు తీసుకుంది. పలు జిల్లాల్లో ప్రైవేటు కంపెనీలకు సాగుకు ప్రభుత్వం అనుమతి నివ్వడం తో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికీ అనుకున్న మేర నర్సరీలు ఏర్పాటు చేయడం లేదు. దీనికి సంబంధించి నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రైతులకు మొక్కలు పంపే బాధ్యత మలేషియాకు చెందిన ఓ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.
కానీ నర్సరీలో ఆలస్యం కావడంతో రైతులకు చేరేందు కు ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ పెంపు నేపథ్యంలో సుమారు 10 ప్రైవేటు కంపెనీలు ఫ్యాక్టరీలు ఆసక్తి కనబరు స్తున్నాయని సమాచారం. ఇందులో ఇప్పటికే కొన్నింటికి ఏరియాను కేటాయించారు. మొత్తంగా ప్రైవేటు కంపెనీల కంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ కార్పోరేషనే నర్సరీల ఏర్పాటుతో పాటు మొక్కలు అందించే అంశంలో ముందుంది.
వచ్చే ఏడాది 70వేల ఎకరాల్లో సాగు..
ప్రస్తుత ఏడాది 2021-22లో 14వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగు లక్ష్యం ఉండగా వచ్చే ఏడాది 2022-23లో 70వేల ఎకరాల్లో సాగును చేపట్టేందుకు కార్పోరేషన్ చర్యలు తీసుకుంటోంది. 70వేల ఎకరాలకు సుమారు 40లక్షల మొక్కలు అవసరం పడుతాయని అధికారులు అంచనావేస్తున్నారు. వీటిలో అధిక దిగుబడి వచ్చే టనేరా, స్ప్రింగ్, యాంగం-బి విత్తనాలను దిగుమతి చేసుకోవాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.