Thursday, November 21, 2024

ఆర్ఆర్ఆర్ భూసేకరణకు రంగం సిద్ధం

తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు ఇటీవలే ముందడుగు పడింది. భూసేకరణకు రంగం సిద్ధమైంది. ఆర్ఆర్ఆర్ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించడంతో కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు సమాయత్తమైంది. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భూసేకరణే కీలక అంశమని ఆర్ఎం డ్ బీ ఉన్నతాధికారులు తెలిపారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు ఆర్ఆర్ఆర్ భూసేకరణ సర్వే బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు ప్రకటనలకే పరిమితమైన ఆర్ఆర్ఆర్ ఇక పట్టాలెక్కబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ ఆర్  రైతులకు ఎంతో మేలు జరుగుతుందనిసోషియే ఎకనామిక్ సర్వే-2021 స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులను రైతులు రాజధాని హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల మార్కెట్లలో అమ్ముకునే విధంగా ఆర్ఆర్ఆర్ దోహద పడుతుందని పేర్కొంది.

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల రహదారులు ఆర్ఆర్ఆర్ తో అనుసంధానమవుతాయని, తద్వారా రైతులు తమ ఉత్పత్తులను సులువుగా అమ్ముకోవచ్చని చెబుతున్నారు. హైదరాబాద్ తోపాటు ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి తదితర పట్టణాల్లో ఐటీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయని సర్వే వెల్లడించింది. ఐటీ ఉద్యోగులు సులువుగా ఆర్ఆర్ఆర్ పై ప్రయాణించి తమ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పింది. కొత్త టెషిన్లతోపాటు కొత్త పరిశ్రమలు ఆర్ఆర్ఆర్ పరిధిలో ఏర్పాటవుతాయని వివరించింది.

కాగా, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు… నగరానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కాబోతోంది. మొత్తం 848 కిలోమీటర్ల మేర నగరం చుట్టూ వలయాకారంలో ఈ ఆర్ఆర్ఆర్ నిర్మాణం కాబోతోంది. ప్రస్తుత ఓఆర్ఆర్‌కు 30 కి.మీల తర్వాత నిర్మించనున్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల గుండా ఆర్ఆర్ఆర్ వెళ్లనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement