వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో ఆదివారం హింసాత్మక చోటుచేసుకున్నాయి.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులపైకి కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ కారును పోనివ్వడం రక్తపాతానికి దారితీసింది. కారు గుద్దడంతో ఇద్దరు రైతులు చనిపోగా, దానికి నిరసనగా చెలరేగిన అల్లర్లలో మరో ఆరుగురు, మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సోమవారం కూడా హైటెన్షన్ కొనసాగుతున్నది. కేంద్ర, రాష్ట్రాలు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా కదిలేది లేదంటూ బాధిత కుటుంబాలు మృతదేహాలతో రోడ్డుపైనే బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అయితే ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. కానీ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పోలీసులు మాత్రం మంత్రి కొడుకు ఆశిష్ పై హత్య కేసును నమోదు చేశారు.