లఖింపూర్ ఖేరీ ఘటనను సుప్రీంకోర్టు నవంబర్ 15కు వాయిదా వేసింది.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.. అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటనలో నలుగురు రైతులు, జర్నలిస్ట్ సహా.. ఎనిమిది మంది చనిపోయారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన వాహనం వారిపై నుంచి దూసుకెళ్లింది. ప్రధాన నిందితుడిగా అజయ్‌మిశ్ర కుమారుడు అశీష్ మిశ్రా సహా.. 13 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily