Sunday, November 17, 2024

ప్రైవేటు బస్సులకు ధీటుగా లహరి స్లీపర్‌ బస్సులు .. మంత్రి పువ్వాడ

ప్రయాణికులకు సౌకర్యం కోసం ప్రైవేటు బస్సులకు ధీటుగా లహరి స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. హైటెక్‌ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్‌ బస్సులను టీఎస్ ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్‌ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా 760 బస్సులకు ఆర్డర్‌ పెట్టామని, వాటిలో ఇప్పటికే 400 పైగా బస్సులు డిపోలకు చేరుకున్నాయన్నారు. త్వరలో 1,300 ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement