మహిళకి మహిళే శత్రువనే సామెతని నిజం చేసింది ఓ లేడీ ఇన్ స్పెక్టర్. ఓ లేడీ ఖైదీని వివస్త్రని చేసి డ్యాన్స్ చేయించింది. పరీ గుల్ కు చెందిన మహిళను అరెస్టు చేసిన లేడీ ఇన్స్పెక్టర్ విచారణకు తీసుకొచ్చింది. క్విట్టాలోని జిన్నా టౌన్ షిప్ లో ఉండే చిన్నారి మర్డర్ కేసుకు ఉన్న సంబంధం గురించి ప్రశ్నించింది. విచారణ నిమిత్తం రిమాండ్లో భాగంగా జైల్లో ఉన్న ఆమెను పలు రకాలుగా వేధించింది. అంతేకాకుండా వివస్త్రను చేసి నగ్నంగా డ్యాన్స్ వేయాలని ఆర్డర్ వేసింది. జైల్లోని ఇతరుల సమక్షంలో అమానవీయంగా ప్రవర్తించిందంటూ క్విట్టా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముహమ్మద్ అజహర్ అక్రమ్ తెలిపారు.
దాంతో ఆ లేడీ ఇన్స్పెక్టర్ ను బలవంతంగా సర్వీస్ నుంచి రిటైర్ చేయించారు అధికారులు. అంతేకాకుండా బాధితురాలిని కస్టడీలోకీ తీసుకుని వేరే జైలుకు పంపనున్నారు. మహిళను ప్రశ్నించే సమయంలో విచారణకు మహిళా అధికారి మాత్రమే ఉండాలని ఆదేశించాం కానీ, ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయడం సహించం అని డీజీపీ తెలిపారు.జైల్లోని ఖైదీలతో నగ్నంగా డ్యాన్స్ వేయించినందుకు సర్వీస్ లో నుంచి డిస్ మిస్ అవడంతో పాటు అధికారుల ఆగ్రహానికి గురైంది. పోలీస్ ఎంక్వైరీ కమిటీలో ఇన్స్పెక్టర్ షబానా ఇర్షాద్ ఘటనకు పాల్పడినట్లుగా రుజువైంది. అమానవీయంగా ప్రవర్తించినందుకు గానూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు అధికారులు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily