Saturday, November 23, 2024

“లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్ ‘‘.. యూపీలో కాంగ్రెస్ మహిళా మారథాన్ ఫుల్ సక్సెస్..

కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో వినూత్న రీతిలో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌హిళను కేంద్రంగా చేసుకుని త‌న ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. “లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్ (నేను అమ్మాయిని, పోరాడగలను) అనే నినాదంతో ఉత్తరప్రదేశ్‌లో త‌ల‌పెట్టిన ప్ర‌చారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊపును తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఈరోజు (ఆదివారం) యూపీలో నిర్వహించిన మారథాన్‌లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.

లక్నో, ఝాన్సీలలో ఒమిక్రాన్ స్ట్రెయిన్ కేసులు పెరుగున్నాయ‌ని, మారథాన్‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేమ‌ని అధికారులు నిరాకరించినప్పటికీ ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కాంగ్రెస్ టీమ్స్‌ చేసిన ప్ర‌చారం.. పోస్టులు, వీడియోలు పెద్ద సంఖ్యలో జ‌నాన్ని స‌మీక‌రించేలా చేశాయి. కాగా, ఝాన్సీలో కొంత‌మంది పోలీసులు మార‌థాన్‌కు వ‌చ్చేవారిని అడ్డుకున్నారు. ఇంటికి వెళ్లాల‌ని సూచించారు. అయినా దానికి అమ్మాయిలు నిరాకరించారు. దీంతో పోలీసులు మార‌థాన్‌కు వ‌చ్చే వారిని ముందుకు వెళ్లనివ్వ‌కుండా అడుగ‌డుగునా అడ్డుత‌గిలారు.

“ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసిన కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులు కొవిడ్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య లేదు. అప్పుడు లేని కండిష‌న్స్‌ ఇప్పుడు ఎందుకు” అని కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక మహిళ యూపీ ప్ర‌భుత్వం, అధికారుల తీరుపై సీరియ‌స్ అయ్యింది.

కాగా, రెండు మారథాన్‌లలో మొదటి ముగ్గురు విజేతలకు కాంగ్రెస్ పార్టీ స్కూటీల‌ని ప్రకటించింది. 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వచ్చే వారికి స్మార్ట్‌ఫోన్‌ను బ‌హూక‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. తదుపరి 100 మందికి ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, మ‌రో 1,000 మంది మహిళలకు పతకాలు అందజేయ‌నున్న‌ట్టు యూపీ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement