Sunday, November 17, 2024

టీ.టీడీపీకి ఎల్‌.రమణ రాజీనామా

తెలంగాణలో టీడీపీ భారీ షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ   అధ్యక్షుడు ఎల్. రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా, రాష్ర్ట ప్ర‌గ‌తిలో భాగ‌స్వామ్యం కావాల‌నే భావ‌న‌తో టీఆర్ఎస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను అని ర‌మ‌ణ తెలిపారు. ఈ క్ర‌మంలో తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాను. గ‌త 30 సంవ‌త్స‌రాలుగా త‌న ఎదుగుద‌ల‌కు తోడ్పాటునందించిన చంద్ర‌బాబుకు ర‌మ‌ణ‌ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. జులై 11న టీఆర్‌ఎస్‌లో రమణ చేరనున్నట్లు రమణ అధికారికంగా ప్రకటించారు.

కాగా, గురువారం టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ తో ఎల్‌ రమణ భేటీ అయిన విష‌యం తెలిసిందే. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతిభవన్‌కు వచ్చిన ఆయన.. సీఎం కేసీఆర్‎ను కలిసారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో గంటకు పైగా వీరి మధ్య చర్చలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానం, గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు. తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఎల్.రమణ వెల్లడించారు. దీనిపై తన అనుచరులతో చర్చించాల్సి ఉందని, వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వివరించారు. సీఎం కేసీఆర్ తో పలు అంశాలు మాట్లాడానని, సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళదామని ప్రతిపాదించారని రమణ తెలిపారు. ఈ క్రమంలో టీడీపీకి రమణ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎల్.రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: పూటకో హామీ..గంటకో అబద్ధం.. కేసీఆర్ పై బండి నిప్పులు

Advertisement

తాజా వార్తలు

Advertisement