Friday, November 22, 2024

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తాం – కూనంనేని

హైద‌రాబాద్ – బీఆఎస్‌, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామన్నారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు. . బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు కలిసినా వాటిని ఆహ్వానిస్తామ‌ని అన్నారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, బీజేపీని నిలువరించాలనేది వామ‌ప‌క్షాద‌ల ప్రధాన ఎజెండా అని తేల్చిచెప్పారు..త‌మ‌కు గౌరవమున్న పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. సీపీఎం, సీపీఐ ఒకటే కత్తి అని, రెండు కత్తులు కావని అన్నారు. సీట్లు ముఖ్యం కాద‌ని,త‌మ‌కు . గౌరవం ముఖ్యమని తెలిపారు. అవసరమైతే పదవులు త్యాగం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ తో పొత్తు ఉన్నా కూడా స‌మ‌స్య‌ల‌పై పోరాడేది తామేన‌ని అన్నారు..ఇదే సంద‌ర్భాగా కందాల, రేగా కాంతారావు, ఎవరి ఓట్లతో గెలిచారు? అంటూ ప్ర‌శ్నించారు..సీపీఎం, సీపీఐ పార్లీలు 40, 50 స్థానాలు ప్రభావితం చేస్తామ‌ని వెల్ల‌డించారు.. 100 ఏళ్ళు త‌మ‌ పార్టీ బ్రతికి ఉందంటేనే మాకు ఒక లక్ష్యం ఉందన్నట్టు అని తెలిపారు. కాగా, లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్ నాశనం చేసేందుకు కుట్ర పన్నిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement