Thursday, November 21, 2024

కుమారస్వామి గెలుపు.. కొడుకు ఓటమి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. జేడీఎస్ అధినేత కుమారస్వామి విజయం సాధించారు. చెన్నపట్న స్థానం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 460 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తాజా ఎన్నికల్లో ఓటమి అంచు నుంచి అతి కష్టమ్మీద బయటపడ్డారు. ఇక ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే నిఖల్ కుమారస్వామి రామ్ నగర్ స్థానం నుంచి ఓటమి చెందారు. ఆయనను కాంగ్రెస్ అభ్యర్థి చిత్తు చేశారు.

గత ఎన్నికల్లో 37 స్థానాల్లో విజయం సాధించిన జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరించగా.. అప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. కీలకమైన నేతలందరూ పరాజయం పాలయ్యారు. కేవలం 21 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. సీనియర్ నేత రేవణ్ణ ఒక్కడే ఆ పార్టీ తరుపున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement