సీఎం కేసీఆర్, కర్నాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి ఇవ్వాల (ఆదివారం) ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఇరువురు నేతలు చర్చ జరిపినట్టు సమాచారం.
ఇక.. జాతీయస్థాయి రాజకీయ పార్టీ ఏర్పాటు అంశాన్ని కుమారస్వామికి చెప్పారు కేసీఆర్. గతంలో కేసీఆర్ బెంగళూరు వెళ్లి.. మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. అదే సమయంలో కమారస్వామితోనూ.. జాతీయ రాజకీయాలపైనా చర్చించారు. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా దేశంలోని ఇతర పార్టీల అధినేతలతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు.