Sunday, November 17, 2024

కర్నాటకలో మళ్లీ హంగే … కుమారస్వామే కింగ్ మేకర్

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అధికారం కోసం రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎత్తుకు పైఎత్తులతో కదన రంగంలో దూసుకెళ్తున్నాయి. అయితే, వీరిద్దరికీ అధికారం అనుకున్నంత సులువు కాదని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్ల డిస్తున్నాయి. అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీతోపాటు జేడీ(ఎస్‌) మధ్య త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ, మరోసారి హంగ్‌ తప్పదని సర్వేలు పేర్కొంటున్నాయి. ఏ ఒక్క పార్టీకి మెజారిటీకి అవసరమైన సీట్లు రాకపోవచ్చని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్ధ సర్వే నివేదిక స్పష్టంచేసింది. ‘సౌత్‌ ఫస్ట్‌’ న్యూస్‌ వెబ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 10 వరకు సర్వేనిర్వ హించారు. ఈ రిపోర్టు ప్రకారం, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించనుంది. హస్తం పార్టీకి 95 -105, బీజేపీకి 90-100, జేడీ(ఎస్‌)కు 25- 30 స్థానాలు లభించవచ్చునని వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీకి 41శాతం, బీజేపీకి 36, జేడీ(ఎస్‌)కి 16శాతం ఓట్లు వస్తాయని, 7శాతం ఓట్లు ఇతరు లకు పోలయ్యే చాన్స్‌ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి 18 సీట్లు అధికంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదేసమయంలో బీజేపీ, జేడీ(ఎస్‌) సంఖ్యా బలం తగ్గనుంది. కాషాయపార్టీ 12 సీట్లు, దేవెగౌడ పార్టీకి 10 సీట్లు తగ్గొచ్చని సర్వే నివేదిక అభిప్రాయపడింది.

సీఎంగా సిద్ధరామయ్యకే మొగ్గు..
ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు మెజారిటీ కన్నడిగులు మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరా మయ్యవైపు మొగ్గుచూపారు. 32 శాతం మంది సిద్ధరాముడే సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారుు. ఈ విషయంలో యెడియూరప్పకు 25శాతం, బొమ్మైకి 20 శాతం మంది మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం రేసులో కుమారస్వామి (18శాతం), డేకే శివకుమార్‌ (5శాతం)కు అంతగా ఆదరణ లభించకపోవడం విశేషం.

కాంగ్రెస్‌-జేడీఎస్‌ బెస్ట్‌..
ఒకవేళ ఈ ఎన్నికల ఫలితాలు హంగ్‌కు దారితీస్తే, సంకీర్ణ ప్రభుత్వ అనివార్యమైతే కాంగ్రెస్‌-జేడీఎస్‌ జతకడితేనే మంచిదని 46శాతం మంది ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, 41శాతం మంది బీజేపీ- జేడీఎస్‌ ప్రభుత్వం మంచిదని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశం ఏ పార్టీకీ లేదని 31 శాతంమంది అభిప్రాయపడ్డారు. కాగా, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని 26 శాతం మంది, బీజేపీ పట్ల 24 శాతం మంది మొగ్గు చూపారు. మొత్తానికి 224 అసెంబ్లిd స్థానాలున్న ఈ రాష్ట్రంలో మెజారిటీకి అవసరమైన 113 సీట్లు ఈ సారి కూడా ఏ పార్టీకీ రావని ఈ సర్వేలో వెల్లడైంది.

ముస్లింలు కాంగ్రెస్‌ వైపే
సామాజిక వర్గాలుగా విశేషిస్తే కొత్త ఓటు బ్యాంకింగ్‌ను సానుకూలంగా మలుచుకోవడంలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయి. ముస్లిం ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక లింగాయత్‌ లు, వొక్కలిగులు నిర్ణాయకం కానున్నారు. రాష్ట్రంలో ఎస్టీల జనాభా సుమారు 7 శాతం ఉంది. వీరిలో ఎస్టీ వాల్మీకి వర్గం 70 శాతం ఆధిపత్యాన్ని కలిగి ఉంది. శ్రీములు ప్రభావం, #హందుత్వ నినాదం నేపథ్యంలో ఎస్టీ నాయక్‌లు బీజేపీకి మద్దతిస్తున్నారు. బాంబే కర్ణాటక, #హదరాబాద్‌ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఉండే మరాఠాల మద్దతు చాలావరకు బీజేపీకి ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఈ ప్రాంతాల్లో అభ్యర్థులను బరిలోకి దింపడంతో ముఖ్యంగా బెళగావి జిల్లాలో ఈ ప్రభావం కొంతమేర కనిపిస్తోంది.
జేడీఎస్‌ కింగ్‌మేకర్‌..
సర్వే అంచనాలను బట్టిచూస్తే, రాష్ట్రంలో ఈసారికూడా హూరా హూరీ పోటీ తప్పదనిపిస్తోంది. హంగ్‌ ఏర్పడే పరిస్థితి కనిపిస్తుండడంతో జేడీ (ఎస్‌) మరోమారు కీలకపాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 20-30 స్థానాలు దక్కించుకుంటే, ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్‌ కింగ్‌మేకర్‌ అవుతుంది. మొత్తంగా సంఖ్యా బలాల్లో స్వల్ప మార్పులతో 2018 తీర్పునే కన్నడిగులు పునరావృతం చేస్తున్నారనే సంకేతాలు వచ్చాయి.

- Advertisement -

అభివృద్ధిలో కాంగ్రెస్‌ బెస్ట్‌…
రాష్ట్రాభివృద్ధిలో కాంగ్రెస్సే మెరుగని 42శాతం మంది ఓటర్లు తమ మనోగతాన్ని వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీకి 38శాతం మంది, జేడీఎస్‌కు 14శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితేనే కర్ణాటక అభివృద్ధి పథంలో పయనిస్తుందని మెజారిటీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదని 51శాతం మంది చెప్పగా, కాషాయపార్టీకి మరోచాన్స్‌ వస్తుందని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆరు శాతం మంది ఎటూ తేల్చలేమన్నారు.

56 నియోజకవర్గాలు.. 5600 శాంపిల్స్‌..
ప్రాబబులిటీ ప్రొఫెషనల్‌ మెథడాలజీ పద్ధ³తి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లిd నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వ#హంచారు. ప్రతి నియోజకవర్గంలో 5 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చసుకుని, ప్రతి కేంద్రం పరిధిలో 20 శాంపిల్స్‌ తీసుకున్నారు. మొత్తం 5600 శాంపిల్స్‌ సేకరించారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేదలు, సంపన్నులు ఇలా తగుమోతాదులో శాంపిల్స్‌ సేకరించారు. భారత్‌ జోడో యాత్ర ప్రభావంతో కాంగ్రెస్‌ మెజారిటీ సాధిస్తుందని ప్రచారం జరిగినా అది సాధ్యమయ్యే అవకాశా లు కనిపించడంలేదు.

సర్వే హైలైట్స్‌:
మొత్తం అసెంబ్లి స్థానాలు 224. మెజారిటీ మార్కు 113. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు.
95-105 స్థానాలతో కాంగ్రెస్‌ అతిపెద్దపార్టీగా అవతరిస్తుంది.
తర్వాతి స్థానాల్లో బీజేపీ (90-100), జేడీఎస్‌ (25-30) నిలిచేచాన్స్‌
గాలి జనార్దన్‌ రెడ్డి స్థాపించిన కేఆర్పీపీ పార్టీకి 1 లేదా 2 సీట్లు రావచ్చు.
ఎంఐఎం, ఎస్డీపీఐ, ఆప్‌ పార్టీలకు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు.
కాంగ్రెస్‌ కు 41 శాతం, బీజేపీకి 36 శాతం, జేడీఎస్‌ కు 16 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు రావొచ్చు.
గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు 18 సీట్లు పెరగొచ్చు. బీజీపీ 12 సీట్లు, జేడీఎస్‌ 10 సీట్లను కోల్పోయే అవకాశం.
ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు 32శాతం మంది ప్రజల మద్దతు.
కాంగ్రెస్‌ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
సంకీర్ణంలో మరోసారి కుమారస్వామికి కింగ్‌మేకర్‌ పాత్ర.

Advertisement

తాజా వార్తలు

Advertisement