మన శ్వేత సౌధం ప్రారంభోత్సవం ఇవ్వాల (ఆదివారం) ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు కూడా వారి వారి చాంబర్లలో పూజలు చేసి, ఆసీనులయ్యారు. ఇక.. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు అయితే కాస్త డిఫరెంట్‌గా ఆఫీసులోకి ఎంటర్ అయ్యారు. ఎటువంటి ఆడంబరం లేకుండా సాదాసీదాగా చాంబర్లోకి వచ్చిన ఆయన.. తొలి ఫైలుపై సంతకం చేశారు.
కాగా, మంత్రి కేటీఆర్ శ్వేత సౌధం ప్రారంభోత్సవం రోజు చేసిన తొలి సంతకం విషయమ్మీద ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. హైదరాబాద్ సిటీలో లక్ష మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై మంత్రి కేటీఆర్ సంతకం చేసినట్టు సమాచారం. కొత్త భవనంలోని మూడో అంతస్తులో కేటీ రామారావు చాంబర్ ఉంది. మంత్రి తన చాంబర్‌లో అడుగిడిన తర్వాత, జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైల్‌ను క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.