అది ఒక సభ… అంతా స్టూడెంట్స్, యువత, విద్యాధికులు ఉన్నారు. ఆ సభలో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ప్రసంగిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు, ప్రసంగం వింటూ యావత్ సభికులు అలా చూస్తుండిపోయారు. పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యారు. ఎందుకంటే ఆ మాటలు అందరిలో ఉత్తేజపరిచేవిగా ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది. ఆ వివరాలు, వీడియో మీకోసం..
‘‘ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలయ్యే శక్తి ఉంది.. వాటిని నడిపే సత్తా ఉంది.. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేసే సత్తా ఆ బుర్ర మనకు లేదా. బుర్ర ఉంది కానీ మనం వాడడం లేదు. ఏం చేస్తున్నం మనం, వీడిదేం కులం.. వాడిదేం మతం.. ఇదేందీ, అదేందీ పాకిస్తాన్ కతేంది, ఆఫ్గనిస్తాన్ కతేంది, చైనా కతేంది.. గాడికే మన లెక్క. ఎన్ని రోజులు పోల్చుకుందాం. పాకిస్తాన్తోని, బంగ్లాదేశ్తోని, ఆఫ్గనిస్తాన్తోని.. పోటీపడద్దా అమెరికాతోని, చైనాతోని, యూరప్తోని..
ఒక చిన్న కథ చెబుతా మీకు.. 1987లో ఇండియా, చైనా రెండూ సేమ్ సిమిలార్ సైజ్ కంట్రీస్.. అప్పట్లో రెండింటి జీడీపీ దాదాపు సమానమే. 35 ఏండ్ల తర్వాత చూసుకుంటే 3 ట్రిలియిన్ డాలర్స్.. చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్స్.. ప్రపంచంలోనే రెండోది..
మనం ఇన్నేండ్లు ఏం చేస్తున్నమయ్యా అంటే.. వాట్సాప్లో వచ్చేటియి షేర్ చేసుకుంట, చిల్లర పంచాయితీలు పెట్టుకుంట కూర్చున్నం. కానీ, చైనా వాడు ఏం చేసిండయ్యా అంటే.. ఫ్యూచర్ ఎట్లుండాలే అనేదాని గురించి ఆలోచించిండు. అమెరికాతో పోటీపడ్డడు. దానికి తగ్గట్టు సాధించాడు.. యువతను కోరేది ఒక్కటే.. పిచ్చి పంచాయితీలు, పిచ్చి పనులు పెట్టుకోకుండా గూగుల్, ఫేస్బుక్ వంటి కొత్త ఆలోచనలు చేయాలే. మంచి ఆవిష్కరణలు చేయాలి.. ప్రపంచానికి భారత్ నుంచి మంచి ప్రొడక్ట్ చేసి ఇవ్వండి. లక్షల మందికి ఉపాధి లభిస్తుంది’’..
ఈ వీడియో www.prabhanews.com లో ఉంటుంది గమనించగలరు..