Friday, November 22, 2024

MIM కార్పొరేటర్ రౌడీయిజంపై కేటీఆర్ సీరియస్

విధుల్లో ఉన్న పోలీసులపై MIM కార్పొరేటర్ దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. తెల్లవారుజాము వరకు తెరిచి ఉన్న షాపులు, హోటళ్లను మూయించేందుకు వెళ్లిన పోలీసులను భోలక్ పూర్ కార్పొరేటర్ మమ్మద్ గౌసుద్దీన్ అడ్డుకున్నారు. రంజాన్ మాసం ముగిసే వరకు రాత్రి పూట కూడా హోటళ్లు, షాపులు తెరిచే ఉంటాయని కార్పొరేటర్ చెప్పారు. అయితే, తమకు పైనుంచి ఆదేశాలు అందాయని.. సమయానికి హోటళ్లను మూసేయాలని పోలీసులు చెప్పబోగా.. ‘మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు’ అంటూ కార్పొరేటర్ గౌసుద్దీన్ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కేటీఆర్ ఆదేశించారు. 

ఎంఐఎం కార్పొరేటర్ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. పోలుసలపై దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు. ముషీరాబాద్ లో పోలీసుల విధులను అడ్డుకున్న కార్పొరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సూచించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement