రాష్ట్రంలో ఏర్పాటైన ఐటీ హబ్‌ల్లో ఖమ్మం సమగ్రమైన ఐటీ హబ్‌గా నిలిచిందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కేటీఆర్ ను కలిసి ఖమ్మం ఐటీ హబ్ ప్రధమ వార్షిక నివేదిక 2021 ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.
ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,45,522 కోట్లుగా నమోదైందని అన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో 6,28,615 మందికి ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ద్వితీయశ్రేణి నగరాల్లో సమాచార సాంకేతికతను విస్తరిస్తున్నామని 1800 అంకురాలు(స్టార్టప్స్) ఏర్పాటయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital