Friday, November 22, 2024

కిడ్నీ ఇస్తాను పిల్లాడిని బతికించండి: తల్లి వేడుకోలుపై స్పందించిన కేటీఆర్‌

లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్‌ నుంచి ఇంటికొచ్చేసిన ఆ బాలుడు ఉన్నట్లుండి మంచాన పడ్డాడు. ఆస్పత్రిలో వైద్యులు రకరకాల పరీక్షలు చేసి అతని రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. దీంతో మూడ్రోజులకోసారి డయాలసిస్ తప్పనిసరైంది. బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తల్లిదండ్రులు దొరికిన చోటల్లా అప్పులు చేశారు. అయితే చివరగా చేసిన డయాలసిస్ చేసే సమయంలో అతని ఆరోగ్యం మరింత విషమించింది. కుమారుడికి కిడ్నీ ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉన్నప్పటికీ వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో తమకెవరైనా సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.

ఈ విషయాన్ని ఒక నెటిజన్‌ గమనించి, తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. సర్‌ ఈ పిల్లాడికి ఏమైనా సాయం చేయండి అని వేడుకున్నాడు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా వెంటనే స్పందించిన కేటీఆర్‌.. ఈ సమస్యను తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. నిమ్స్‌ ఆస్పత్రి వర్గాలతో కలిసి ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement