Friday, November 22, 2024

హుహుహూ ఇట్స్​ ఈటింగ్​ టైమ్​.. న్యూయార్క్ సిటీలో తన స్టూడెంట్ లైఫ్‌ యాది చేసుకున్న కేటీఆర్..

తెలంగాణ మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్, తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ సిటీలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో న‌డుస్తూ మీటింగ్ కి బయలుదేరారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్ తో కూడిన చికెన్ రైస్ తిన్నారు.

ఆ తర్వాత సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో న్యూయార్క్ లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు. ఉదయం నుంచి మంత్రితో ఉన్న తెలుగు ఎన్నారైలు, కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా వరుసలో నిలబడి ఫుడ్‌ కొనుక్కోవడం, తర్వాత మీటింగ్ కి క్యాబ్‌లో వెళ్లడం వంటి విషయాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆయన సింప్లిసిటీకి, క‌మిట్‌మెంట్‌కి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement