తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్‌లు వేశారు. ‘‘కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోనీ ఆర్థిక సాయం అయినా ఉంటుందా? అంటే అది కూడా లేదు. అయినప్పటికీ ఇండియాలోనే యంగెస్ట్ స్టేట్ అయినా తెలంగాణ మాత్రం.. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలోనే నిర్మించాం” అని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టే.. సవాళ్లను అధిగమించి, అభివృద్ధికి తోడ్పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణపై కేసీఆర్ ప్రేమకు ఏది సాటిరాదు అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్..
కేంద్రంపై కేటీఆర్ పంచ్‌లు.. జాతీయ హోదా ఉండదు, పైసా లాభం లేదంటూ విసుర్లు..
Advertisement
తాజా వార్తలు
Advertisement