Sunday, November 17, 2024

కవిత అరెస్ట్ కావచ్చు… కెసిఆర్/ ఢిల్లీ కి పయనమైన కె టి అర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం విచారించనుంది. ఈ నేపథ్యం లో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. రేపు కవితను అరెస్ట్ చేసే అవకాశం వుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోని.. అందరినీ వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భయపడేది లేదు.. పోరాటం ఆపేది లేదు, వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామన్నారు . మరోవైపు ఈడీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసంలో తెలంగాణ ఏజీ రామచంద్రరావు, న్యాయవాదులు గద్దె మోహన్ రావ్, సోమా భరత్ కుమార్ తో కవిత చర్చిస్తున్నారు

ఢిల్లీ లో కె టి అర్… శనివారం హరిష్ హస్తినకు పయనం

ఇక కవితకు అండగా ఉండేందుకు సోదరుడు, మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తర్వాత హుటాహుటిన కేటీఆర్ ఢిల్లీ బయల్దేరారు. సుదీర్ఘ చర్చ తర్వాత ఢిల్లీ వెళ్లాలని కేటీఆర్‌కు సీఎం సూచించారు.శనివారం కవిత ఈడీ విచారణ ఉండటంతో కేటీఆర్ హస్తిన టూర్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఆయన వెంట వెళ్తున్నారని తెలుస్తోంది. ఆలాగే ట్రైబల్ షూటర్, మంత్రి హరిష్ రావు ను కూడా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల్సింది గా కె సి ఆర్ ఆదేశించినట్లు సమాచారం. . శనివారం హరిష్ హస్తినకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement