హుజురాబాద్ ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఉపఎన్నికతోపాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించడమే ప్రధాన అజెండాగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పురోగతి, కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కృష్ణానదిపై ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్రంలోని రాజకీయ పక్షాల వైఖరి, విపక్షాల విమర్శలకు దీటుగా స్పందించడం, వాటిని ఎదుర్కొనే వ్యూహాలపై సమాలోచనలు చేయనున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని…విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శులు, నేతలకు ఉపఎన్నిక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ మండల బాధ్యులను ప్రకటించిన రేవంత్