Wednesday, November 20, 2024

సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టుకు భూమిపూజ

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. హైదరాబాద్ తాగు నీటి అవసరాలను తీర్చేందుకు శాశ్వత పరిష్కారంగా జలమండలి నిర్మిస్తున్న భారీ ఇన్ టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గజదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబిత, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఇంటెక్ వెల్ ప్రాజెక్టు పనులను మంత్రులు పరిశీలించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో వేసవిలో భవిష్యత్తులో తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా తాగునీటి సరఫరా పథకం కింద నీటిని తోడేందుకు సుంకిశాలలో ఇంటెక్ వెల్ స్టేషన్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు శనివారం శంకుస్థాపన చేశారు. మొత్తం 1,450 కోట్ల అంచనా వ్యయంతో, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) కు 725 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఏడాది పాటు వర్షాభావ పరిస్థితులు ఎదురైనా హైదరాబాద్‌ నగరానికి తాగునీటి అవసరాలను సుంకిశాల ఇంటక్‌ ప్రాజెక్టు తీరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement