మునుగోడు బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) రాత్రి మంత్రి కేటీఆర్ చౌటుప్పల్ టౌన్లో రోడ్‌షో నిర్వహించారు. కొయ్యల గుడెం నుంచి చౌటుప్పల్ వరకు 5 కిలోమీటర్లు మేర సాగిన రోడ్‌షో మొత్తం జనంతో కిక్కిరిసింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, మునుగోడు అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్న ఈ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఎప్పుడో ఖాయం అయ్యిందన్నారు. యువకులు జోష్ తో ఘన స్వాగతం పలికారని, వారి ఉత్సాహం చూస్తుంటే ఉంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ లో గెలిచి, బీజేపీతో బేరసారాలు చేసి.. 18 వెల కోట్ల కాంట్రాక్టు తీసుకొని రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని ఎద్దేవా చేశారు.
రాజగోపాల్ రెడ్డి ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడలేదని, డబ్బు మదంతో ప్రజలను, ప్రజాస్వామ్యన్నీ అపహాస్యం చేస్తూ.. ప్రజలపై బలవంతంగా ఈ ఉప ఎన్నికను రుద్దారన్నారు విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. రాష్ట్రంలో అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా కూడా నల్గొండ జిల్లానే అన్నారు. 60 ఏళ్ళల్లో పరిష్కరం కానీ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపింది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని. ఇదే చౌటుప్పల్ లో భగీరథ ఫైలాన్ ను ఆవిష్కరించి, ఇంటింటికి సురక్షిత తాగునీరు అందిస్తున్నారన్నారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో రైతులకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని, రైతుబంధు పథకంతో రైతుల తలరాతలు మార్చేశారన్నారు. మునుగోడును తాను దత్తత తీసుకుంటానని, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం అన్నారు మంత్రి కేటీఆర్. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టండి అని పిలుపునిచ్చారు.