Tuesday, November 26, 2024

ఈటల కోసం చివరి వరకు ప్రయత్నించా.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ పార్టీలోనే ఉండేలా చివరి వరకు ప్రయత్నించానని కేటీఆర్ అన్నారు. కేబినెట్‌లో కొనసాగుతూనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈటల తప్పుబట్టారని తెలిపారు. ఐదేళ్ల నుంచి కేసీఆర్‌తో గ్యాప్ ఉంటే ఈటల రాజేందర్ కేబినెట్‌లో ఎందుకు కొనసాగారని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజేందర్ విమర్శలు చేసినా కేబినెట్‌లో కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్‌ ఎంత చేసిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఈటలకు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం చేయలేదన్నారు. 2003లో ఎంత కష్టమైనా పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు.

టీఆర్ఎస్‌లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీ నేతలతో ఈటల సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ భేటీలోనే మాట్లాడితే పోయేదని.. కానీ, సింపతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి ఆయనకు ఆయనే దూరమయ్యారని విమర్శించారు. హుజూరాబాద్‌లో పార్టీల మధ్యనే పోటీ ఉందని.. వ్యక్తుల మధ్య కాదని కేటీఆర్ స్పష్ట చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అన్నారు.  చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఎలాంటి విషయం లేదని కేటీఆర్ విమర్శించారు. వచ్చే రెండు, మూడు నెలలు రాజకీయాలు రంజుగా ఉంటాయన్నారు. ఏపీ జలవివాదాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా న్యాయం తెలంగాణవైపే ఉందని కేటీఆర్ చెప్పారు.

ఇది కూడా చదవండి: రెండు రోజులు జాగ్రత్త.. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

Advertisement

తాజా వార్తలు

Advertisement