Friday, November 22, 2024

అందుకే సోనూసూద్ పై ఐటీ దాడులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి చేయూతనిచ్చి రియల్ హీరో అయ్యాడు సినీనటుడు సోనూసూద్. కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థికంగా అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న పేదలకు వైద్య ఖర్చుల కోసం నిస్వార్థంగా ఆర్థిక సహాయం చేశారు. అయితే తాజాగా సోనూసూద్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన కోవిడ్-19 వారియర్స్ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారనే భయంతోనే ఈడీ, ఐటీ దాడులు చేశారని వ్యాఖ్యానించారు.‘ఎవరైనా మొదటగా సహాయం చేయడానికి ముందుకు వస్తే కేవలం పేరు, ప్రఖ్యాతల కోసమే ఇదాంతా చేస్తున్నారని అంటారు.. ఇది దాటిన తర్వాత వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు సేవలు చేద్ధాం అని చూస్తుంటే ఆయన మీద దాడులు చేస్తున్నారని విమర్శించారు. సోనుసూద్‌ రియల్‌ హీరో అనీ.. ఇలాంటి వాటికి సోనుసూద్‌ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాము అండగా ఉంటామన్నారు. కొవిడ్‌ కష్టకాలంలో సోనుసూద్‌ సేవాభావాన్ని చాటుకున్నారని, తన పని.. సేవతో ప్రపంచం దృష్టి ఆకర్షించారన్నారు. విపత్తు సమయాల్లో ప్రభుత్వమే అన్నీ చేయలేదని.. స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement