Wednesday, November 20, 2024

కేటీఆర్ ఔదార్యం.. సరస్వతీ పుత్రులకు ఆర్థిక సాయం..

ఇద్దరు మెరికల్లాంటి పేదింటి బిడ్డలకు ఇవ్వాళ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అందులో ఒకరు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ సీటు సాధించగా, మరొకరు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబీఎస్ సీటు సంపాదించాడు.

సూర్యాపేట్ జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు పిడమర్తి ప్రసాద్ కుమారుడు అనిల్ కుమార్‌కు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అప్లైడ్ జియాలజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించడం కష్టమవుతున్నది. విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి రాగా ఇవ్వాళ ఆ కుటుంబాన్ని కలిసి అనిల్ కుమార్ విద్యకు కావలసిన ఆర్థిక సాయం అందించారు. చదువు పూర్తయ్యాక అమ్మా నాన్నలను మంచిగా చూసుకోవాలని, ఇతరులకు సాయపడాలని మంత్రి అనిల్ తో అన్నారు.

మహబూబ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గోపాల్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబీఎస్ సీటు పొందాడు. కానీ ఖర్చులకు డబ్బులు లేక సాయం అర్ధిస్తూ మంత్రి కేటీఆర్ గారికి గత నెలలో ట్వీట్ చేసాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ నేడు ప్రశాంత్ రెడ్డిని తన కార్యాలయంలో కలిసి అతని చదువు ఖర్చులకు అవసరమైన ఆర్థిక సాయం అందించాడు. డాక్టర్ అయ్యి పేదప్రజలకు సేవలు అందించాలని మంత్రి కేటీఆర్ ప్రశాంత్‌ రెడ్డికి సూచన చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement