Saturday, November 23, 2024

Big Breaking: రాహుల్ విమర్శలకు కేటీఆర్ కౌంటర్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలకు తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వరంగల్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మమ్మీ అధ్యక్షురాలు.. ఈయన డమ్మీ ఏంటో తెలియదన్నారు. మమ్మీ చేతిలో రిమోట్, డమ్మీ చేతిలో పాలన అన్నారు. ఏ హోదాలో డిక్లరేషన్ ప్రకటించారో చెప్పాలన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు.. కాంగ్రెస్ కు పది ఛాన్స్ లు ఇచ్చారన్నారు. 50ఏళ్లు మీకే అధికారం ఇచ్చారు కదా అన్నారు. మీ నాయనమ్మ, మీ నాయన, మీ ముత్తాతకు అధికారం ఇచ్చినప్పుడు ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement