(పసునూరి భాస్కర్, న్యూస్ నెట్‌వర్క్ ఇన్‌చార్జి)
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య ప్రదర్శిస్తున్న రాజకీయ చాణక్యం, ముక్కోణ వ్యూహాలు రాజకీయ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఓ వైపు కేంద్రం వైఫల్యాలపై నేరుగా గణాంకాలతో సహా దాడి చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ విధానాలను డైరెక్ట్‌గానే క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో యువతను కేటీఆర్ ఆలోచింపజేస్తున్నాడని పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు.
ప్రధాని మోడీ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విధానపరమైన లోపాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌కు దేశవ్యాప్త అభిమానులు ఏర్పడుతున్నారు. కేటీఆర్ సునిశిత పరిశీలనకు, ధైర్యానికి, అంశాలను నేరుగా ఎత్తి చూపుతున్న విధానాలను మేధావులు, విద్యావంతులు ప్రశంసిస్తున్నారు.
అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ జాతీయ పార్టీలను దునుమాడుతూ కేసీఆర్ జాతీయ వ్యూహానికి, ప్రణాళికలకు మద్దతు సాధిస్తున్నారు.. ఆసక్తిని ఏర్పరుస్తున్నారు. ఓ వైపు తెలంగాణలో బహుముఖ శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ పెట్టుబడులకు తెలంగాణను స్వర్గధామంగా మార్చిన కేటీఆర్ తాజా విదేశీ పర్యటనతో వేలకోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. కేటీఆర్ తెలంగాణకు ఒక ఎస్సెట్ అని, కేటీఆర్ వల్లే తాము తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని అనేక దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి.
పరిశ్రమల వెల్లువ ద్వారా ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నారు. వ్యాపార పురోగమనం వల్ల సర్కారు పరిపుష్టికి కూడా ఇది దోహదపడుతోంది. ఐటీని ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ లాంటి నగరాలకు విస్తరించిన కేటీఆర్ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నారు. సరికొత్త టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకు పరిచయం చేస్తున్నారు. సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. మునిసిపల్ శాఖ ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మార్చిన కేటీఆర్.. ఎస్సార్ డీపీ ద్వారా నగరాన్ని కొత్తగా మార్చారు. కొత్త ్లఫఓవర్లు, అండర్ పాస్‌లతో నగర ముఖచిత్రం మారింది. తన శాఖతో పాటు ప్రభుత్వపరంగా అధికారులను సమన్వయం చేస్తూ.. ప్రజలకు సత్వరన్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో చేపట్టిన సంస్కరణలు, కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ నగరాల్లో హైదరాబాద్‌ను నిలిపింది.
జిల్లాల్లో సమన్వయం.. పార్టీ నేతలకు అభయం
జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను, అంతర్గత సమస్యలను, ఆధిపత్య పోరును వ్యూహాత్మకంగా కేటీఆర్ పరిష్కరిస్తున్నారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటి లాంటి వారితో సమన్వయం కోసం ఆయన చాకచక్యంగా వ్యవహరిస్తున్న తీరు పార్టీ శ్రేణుల అభిమానం చూరగొంటున్నది. కేటీఆర్ హార్డ్‌వర్క్, నాయకత్వ లక్షణాలు, వ్యూహత్మక అడుగులు, క్యాడర్‌లో జోష్ నింపడంతో పాటు భవిష్యత్ మీద భరోసా పెంచుతున్నాయి. అందుకే…కేటీఆర్ పర్యటన ఎక్కడ జరిగినా ప్రజలు తండోప తండాలుగా హాజరవుతున్నారు.
సీనియర్ నేతలు కూడా ఇగోకు వెళ్లకుండా కేటీఆర్ నాయకత్వంలో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తు కేటీఆరేనని విశ్వసిస్తూ ముందుకు సాగుతున్నారు. కేటీఆర్ ప్రసంగాల్లో పదును నేతలను, క్యాడర్‌ను ఆకట్టుకుంటుండగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి లక్షలాది అభిమానులను ఏర్పరుస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగానే కాకుండా సమర్ధవంతమైన, బ#హుముఖ సామర్ధ్యం కలిగిన నేతగా, తమ భవిష్యత్తుగా టిఆర్‌ఎస్ క్యాడర్ మనసుల్లో కేటీఆర్ భరోసా నింపుతున్నారు. యువనేత మార్గదర్శకత్వంలో పార్టీకి, క్యాడర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విశ్వసిస్తున్నారు.