Monday, November 18, 2024

కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల్సిందే..ఆర్. క్రిష్ణయ్య..

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బీసీ అని చెప్పుకుంటూ బీసీల‌కే వెన్నుపోటు పొడుస్తున్నార‌ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం , ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడాన్ని ఆపాలంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు జన గణనలో భాగంగా కులగణన చేపట్టేందుకు కేంద్రంపై ఒత్తడి తెచ్చేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం కావాలని.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను క్రిష్ణయ్య కోరారు. సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమం కోసం బీసీ గణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపారన్నారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరితే బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతుందని ఆరోపించారు. బీసీలను ఎన్నికల్లో ఓట్లుగానే చూస్తున్నారని.. వారి హక్కుల్ని కాలరాసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement