Friday, November 22, 2024

అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణ‌య్య కుమార్తెకు కేసీఆర్ అండ‌… డాక్ట‌ర్ గా ఉన్న‌త శిఖ‌రాల‌కు

కానిస్టేబుల్ కృష్ణ‌య్య తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో నిజామాబాద్‌ జిల్లా, కామారెడ్డిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కృష్ణ‌య్యకు విద్యార్థి దశ నుండే తెలంగాణ అంటే పడిచచ్చేవాడు. కానిస్టేబుల్ కృష్ణ‌య్య సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన చెందాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 9 నవంబరు 2009న కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్న సందర్భంలో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. కిష్టయ్య ఆ మరుసటి రోజే తెలంగాణ రాష్ట్రంలోనే తమ బతుకులు మారుతాయని పేర్కొంటూ మరణ వాంగ్మూలం రాసుకుని కామారెడ్డి పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి 1 డిసెంబర్ 2009న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్నాడు. ఆయ‌న బ‌లిదానం ఉద్య‌మానికి మ‌రింత‌స్ఫూర్తి ఇచ్చింది..ఉద్య‌మం తీవ్ర‌మై చివ‌రికి తెలంగాణ క‌ల సాకార‌మైంది..


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా తరువాత కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటూ ఇంటి స్థలంతో పాటు ఆయన భార్య పద్మ, కొడుకు రాహుల్ కు ప్రభుత్వ ఉద్యొగాలు ఇచ్చింది..ఇక కూతురు ప్రియాంక మెడిసిన్ చదవడం కోసం ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఫీజును టీఆర్ఎస్ పార్టీ చెల్లించింది.. తాజాగా ప్రియాంక మెడిసిన్ పూర్తి చేసి డాక్ట‌ర్ గా విధులు నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ది.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ త‌మ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవ‌డం వ‌ల్లే ఈ ఉన్న‌త స్ధితికి చేరామంటూ కృష్ణ‌య్య కుటుంబ‌స‌భ్యులు కెసిఆర్ కి కృత‌జ్ఞఃత‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement