Friday, November 22, 2024

న‌దిలో కొట్టుకుపోయిన వేద‌పాఠ‌శాల ఉపాధ్యాయుడు .. విద్యార్థులకు సంతాపాలు

సంద్యావంద‌నం కోసం కృష్ణాన‌దిలో దిగిన వారు మృత్యువాత ప‌డ్డారు. శ్వేత‌శృంగాచ‌లం వేద‌పాఠ‌శాలకు చెందిన ఉపాధ్యాయుడు, ఐదుగురు విద్యార్థులు అచ్చంపేట మండ‌లం మాదిపాడు స‌మీపంలో కృష్ణాన‌దిలో సంధ్యావంద‌నానికి దిగ‌గా నీటి ప్ర‌వాహ‌దాటికి కొట్టుకుపోయి మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ . విద్యా, హోంశాఖ మంత్రులు తీవ్ర ఆవేద‌న‌ని వ్య‌క్తం చేశారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు, విద్యార్థులు ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి మృతి చెందటం విచారకరమని తెలిపారు. మృతులు హర్షిత్‌ శుక్లా, శుభమ్‌ త్రివేది, అన్షుమన్‌ శుక్లా, శివ శర్మ, నితేష్‌ కుమార్‌ దిక్షిత్‌ కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో వివిధ సంస్థల యాజమాన్యాలు మరింత శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సూచించారు. ఈ మేరకు ఏపీ రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

కృష్ణానదిలో మునిగి వేదపాఠశాల విద్యార్థులు మృతిచెందిన దుర్ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత విచారం వ్యక్తంచేసారు. ఈ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వేద పాఠశాల విద్యార్థుల మృతిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్స్పం దించారు. కృష్ణా నదిలోకి దిగి విద్యార్థులు మరణించటం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు మంత్రి సురేష్. విద్యార్థుల మృతికి సంతాపం తెలిపిన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు. ద‌ర్యాప్తు ప్రారంభించారు. నీటి ఉథృతి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement