Saturday, September 21, 2024

కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీతో జలవివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలంటూ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. సమావేశం ఎప్పుడు జరిగేది త్వరలో ప్రకటిస్తామని కేఆర్ఎంబీ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు మరింత ముదిరిన నేపథ్యంలో, ఈ కీలక భేటీ వాయిదా పడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, కృష్ణా నది నీటి వివాదంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. త్రిసభ్య కమిటీ అజెండాలో తమకు సంబంధించిన అంశాలు లేవని, తమ అంశాలతో ఈ నెల 20 తర్వాత సమావేశం నిర్వహించాలని కోరింది. విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement