కృష్ణా జిల్లాలో ఫ్రీ ఫైర్ గేమ్ రెండు గ్రూపుల మధ్య చిచ్చురేపింది. గన్నవరంకు చెందిన కొందరు యువకులు ఆన్‌లైన్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుకుంటున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి పామర్తి నగర్‌కు చెందిన మరికొంతమంది యువకులతో కలిసి ఈ గేమ్ ఆడుతున్నారు. గేమ్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య వివాదం జరిగింది. గన్నవరంకు చెందిన ఓ యువకుడిని పామర్తి నగర్‌కు చెందిన యువకుడిని కొట్టాడు. ఈ వ్యవహారం రెండు గ్రూపుల మధ్య చిచ్చురేపింది. దీంతో రెండు గ్రూపులు కర్రలు, బ్లేడులో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులు దాడులకు పాల్పడగా గణేష్ అనే విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. దాడులకు సంబంధించి పోలీసులు 10 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవలో ఉన్న యువకులు గన్నవరం చుట్టు పక్కల గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా మైనర్‌లు కావడంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
ఫ్రీఫైర్ గేమ్ కోసం విద్యార్థుల మధ్య ‘వార్’
By ramesh nalam
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement