Monday, November 25, 2024

మార్కెట్‌లోకి కొవిడ్ టాబ్లెట్స్.. ఫస్ట్ హైదరాబాద్‌లోనే రిలీజ్..

కరోనా మహమ్మారిని అయిదు రోజుల్లో కట్టడి చేసే సామర్థ్యం ఉన్న మెడిసిన్‌గా చెప్పుకుంటున్న మోల్నుపిరావిర్‌ ఇండియాలో ముందుగా హైదరాబాద్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ప‌ర్మిష‌న్‌ ఇచ్చింది. ఇండియాలో ఈ ట్యాబెట్లు తయారు చేసేందుకు 13 కంపెనీలు అనుమతి తీసుకోగా అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కి చెందినవే కావడం గమనార్హం.

మోల్నుపిరావిర్‌ని ఇండియాలో అందించేందుకు అనుమతి పొందిన 13 కంపెనీల్లో ఒకటైన ఆప్టిమస్‌ సంస్థ మోల్‌కోవిర్‌ పేరుతో ట్యాబ్లెట్లు తయారు చేసింది. వీటిని హైదరాబాద్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. జనవరి 3 నుంచి మిగిలిన సిటీస్‌లో క్రమంగా పంపిణీ చేస్తామని ప్రకటించింది. కాగా, మెల్నుపిరావిర్‌ని రేపోమాపో మార్కెట్‌లోకి తెచ్చేందుకు మిగిలిన కంపెనీలు కూడా వ‌ర్క్ స్పీడ‌ప్ చేస్తున్నాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి కలవరపెడుతుంటే మరోవైపు థర్డ్‌ వేవ్‌ భయాలు దేశాన్ని కమ్మేస్తున్నాయి. ఈ టైమ్‌లో కరోనాకి విరుగుడుగా మోల్నుపిరావిర్ టాబ్లెట్స్‌ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌లో వాసులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement