Friday, November 22, 2024

యూనివ‌ర్స‌ల్ వ్యాక్సిన్ గా ‘కొవాగ్జిన్’ – క‌ల నెర‌వేరింద‌న్న భార‌త్ బ‌యోటెక్ ప్ర‌తినిధులు

కొవాగ్జిన్ టీకాను చిన్నారులు, వృద్ధులకి అంద‌రికీ పంపిణీ చేస్తున్నారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 18ఏళ్ల‌కి పై బ‌డిన వారికి కొవాగ్జిన్ పంపిణీ చేస్తున్నారు. 15 నుంచి 18ఏళ్ల వ‌య‌సు ఉన్న వారికి కొవాగ్జిన్ టీకాని ఇస్తున్నారు. కాగా ఈ వ్యాక్సిన్ ఘ‌న‌త‌ని సాధించింది. యూనివ‌ర్స‌ల్ వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ టీకా గుర్తింపు తెచ్చుకుంద‌ని భారత్ బ‌యోటెక్ ప్ర‌తినిధులు అధికారికంగా ప్ర‌క‌టించారు. భార‌త్ బ‌యోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ని రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఇక బూస్ట‌ర్ డోస్ గాను కొవాగ్జిన్ టీకాని పంపిణీ చేస్తున్నారు. ఇటీవ‌ల భార‌త్ బ‌యోటెక్ త‌మ కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమ‌తులు ఇవ్వాల‌ని డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ను లేఖ ద్వారా కోరింది. అయితే డీజీసీఐ కి లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే కొవాగ్జిన్ కు యూనివ‌ర్స‌ల్ వ్యాక్సిన్ గా గుర్తింపు వ‌చ్చింది. అయితే దీని పై స్పందించిన భార‌త్ బ‌యోటెక్ ప్ర‌తినిధులు.. కొవాగ్జిన్ ను గ్లోబ‌ల్ వ్యాక్సిన్ గా అభివృద్ధి చేయాల‌న్న త‌మ క‌ళ నెర‌వేరింద‌ని ఆనంద‌న్ని వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement