Friday, November 22, 2024

కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్ అసంతృప్తి

హుజురాబాద్ టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డికి షాక్ తగిలింది.. హుజురాబాద్ ఉప ఎన్నికతో హాట్ టాపిక్‌గా మారిన రాజకీయ నేత పాడి కౌషిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ తరపున హుజురాబాద్ టికెట్ ఆశించి పార్టీలో చేరిన కౌషిక్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ఫైల్ పంపారు. అయితే గవర్నర్ తమిళి సై ఆ ఫైల్‌ను హోల్డ్‌లో పెట్టారు. తాజాగా ఆ ఫైల్ గురించి గవర్నర్ తమిళి సై మౌనం వీడారు. కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేయడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సేవ చేసిన వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందని, కౌషిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Drugs case: ఈడీ విచారణకు హాజరయిన హీరో రానా

Advertisement

తాజా వార్తలు

Advertisement