Tuesday, November 26, 2024

కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ఝలక్.. హుజురాబాద్ టికెట్ డౌటే?

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ తరుపున బరిలో దిగేది ఎవరు? పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి టికెట్ ఖరారు అయ్యిందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి వీరే అంటూ చాలా మంది పేర్లు వినిపించినా ఇప్ప‌టికీ ఎవ‌రూ ఫైన‌ల్ కాలేదు.

కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తాడనుకున్న కౌశిక్ రెడ్డిని టికెట్ ఆశ చూపి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ త‌న పార్టీలోకి తీసుకున్నాడ‌నే ప్ర‌చారం తొలి నుంచి జరుగుతోంది. కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం వైరల్ అయిన‌ప్ప‌టి నుంచే ఆయ‌నకు టీఆర్ఎస్ టికెట్ ఖాయ‌మైంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టికెట్ ఖాయ‌మే అని అంతా ఊహించారు. కానీ ఇక్క‌డే కేసీఆర్ ట్విస్టు ఇచ్చారు. కౌశిక్ చేరిక సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప‌దువులు శాశ్వ‌తం కాద‌ని, పార్టీలో ఉంటే అదే పెద్ద ప‌వ‌ర్ అని, ఏ బాధ్య‌త ఇచ్చినా నిర్వ‌ర్తించాలంటూ వ్యాఖ్యానించడంతో అస‌లు టికెట్ ఖాయం కాలేదని డౌట్ కౌశిక్ అభిమానులు వ్యక్తం అవుతోంది. ఈ కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో కౌశిక్ కూడా డైలమాలో ప‌డ్డాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

నిజానికి కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ కావడంతో ఆయన ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ కు అనూకులంగా ఉన్న కోవర్ట్ అనే విషయం బహిర్గతం అయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ డబ్బులు కూడా ఇచ్చిందని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అనేక సందర్భాల్లో చెప్పారు. అంతే కాదు, తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పలు గ్రామాల్లో ఇదే విషయాన్ని ఈటల ప్రజల వద్ద ప్రస్తావిస్తున్నారు. దీంతో గులాబీ పార్టీ అలర్ట్ అయ్యింది. టికెట్ విషయంలో అచితూచి వ్యవహరిస్తోంది. అందుకే కౌశిక్ రెడ్డికి టికెట్ ఖరారు అయిందనే హామీని ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. కౌశిక్ ఆడియో లీక్ కావడం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో రెండో ఛాయిస్ లేక ఆయన గులాబీ తీర్ధం పుచ్చుకున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కౌశిక్ రెడ్డి హుజురాబాద్ బరిలో ఉంటారా? లేదా? అన్నది ఆయన అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మీద హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది త్వరలో తెలిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండిః అభివృద్ధి కావాలంటే ఉప ఎన్నికే మార్గామా?

Advertisement

తాజా వార్తలు

Advertisement