Saturday, November 23, 2024

రామ‌న్న రాక‌కోసం ఎదురుచూస్తున్న కోనాపూర్‌.. నానమ్మ ఊరుపై మ‌మ‌కారం చాటాల‌ని విన్న‌పం

బీబీపేట్​, (ప్రభ న్యూస్): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తల్లిగారి ఊరు బీబీపేట మండలంలోని కోనాపూర్ పై మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక మ‌మ‌కారం చూపాల‌ని ఆ గ్రామ‌స్తులు కోరుతున్నారు. సీఎం తల్లి నివసించిన ఊరి పరిసర ప్రాంతాలను డెవ‌ల‌ప్ చేయ‌డానికి కేటీ రామారావు ప్ర‌త్యేక చొర‌వ తీసుకోవాలంటున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను నూతన హంగులతో నిర్మించి.. ఇచ్చిన హామీ నెరవేర్చడానికి త్వ‌ర‌లోనే భూమిపూజ చేయ‌డానికి రావాల‌ని కోరుతున్నారు.

అయితే నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి, గ్రామాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దడానికి ఫండ్స్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి కోనాపూర్ గ్రామానికి రామ‌న్న రాక‌కోసం ఊరు ఊరంతా వేయి కండ్ల‌తో ఎదురు చూస్తోంది. కాగా, ఇప్ప‌టికే గ్రామంలో నూతన పాఠశాల భూమి పూజ కోసం స్థలాన్ని కూడా చ‌దును చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement