నల్గొండ, ప్రభన్యూస్ బ్యూరో: నల్గొండ అసెంబ్లీ నియోజ కవర్గం నుంచి తానే పోటీ-కి దిగుతున్నానని భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన నిరుద్యోగ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. నల్గొండ పోటీ-కి సంబంధించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోనే తన టికెట్ తానే ప్రకటించుకుంటు-న్నానని పేర్కొన్నారు. పోటీ-కి సంబం ధించి బి.ఫామ్‌ను తన ఇంటికి పంపాలని కోరారు. రేవంత్ రెడ్డి నల్గొండకు రావడంతో అసెంబ్లీ ఎన్నికలకు తన తొలి దశ ప్రచారం పూర్తయినట్టేనని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని వెంకట్ రెడ్డి వివరించారు.
రేవంత్, ఉత్తమ్ లకు కోమటిరెడ్డి షాక్ – నల్గొండ నుండి తానే పోటీ అంటూ ప్రకటన
Advertisement
తాజా వార్తలు
Advertisement