Monday, November 25, 2024

రేవంత్ రెడ్డికి పీసీసీ ఎందుకిచ్చారు?: హైకమాండ్ పై కోమటిరెడ్డి ఫైర్

కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుంది కాబట్టే మేము సైలెంట్ గా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు జరగడం లేదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడింది తాము అని, కొత్తగా వచ్చినవారికి పదవులు ఇస్తే..30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న మా పరిస్థితి ఏంటి? అని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన కాంగ్రెస్ వాదులకు పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే పార్టీ బాగుపడుతుందని, తెలంగాణలో బతికి బట్ట కడుతుందని అభిప్రాయపడ్డారు. లేదంటే కాంగ్రెస్ నష్ట పోతుందని తెలిపారు.   అధ్యక్ష పదవి కోసం హైకమాండ్ ముందు నిర్ణయం తీసుకుని, తర్వాత ఏదో అభిప్రాయం తీసుకున్నట్లు యాక్ట్ చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.  ఎల్లయ్య మల్లయ్య అభిప్రాయం తీసుకుని అధ్యక్షుని నియమిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement