Tuesday, November 26, 2024

Exclusive | కోకాపేట భూములా, బంగారు గనులా!.. ప్రభుత్వానికి కాసుల పంట!

హైదరాబాద్​లోని కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలం భలే ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఈ వేలంలో ఒక్కో ఎకరా భూమి కోట్లకు కోట్లే దాటేసి వెళ్తోంది. ప్రభుత్వం ఆశించిన దానికంటే రెట్టింపు స్థాయిలో బిడ్డర్లు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అటు ఎయిర్​పోర్టుకు, ఇటు ఐటీ కారిడార్​కు దగ్గరగా ఉండడమే కాకుండా.. ట్రాన్స్​పోర్టేషన్​కి కీలకంగా ఉన్నఔటర్ రింగ్​రోడ్డు దగ్గరగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక.. ఒక్కో ఎకరం 1‌‌00 కోట్ల రూపాయల దాకా వెళ్లినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటున్నారు పరిశీలకులు.. దీంతో కోకాపేట భూములా.. బంగారు గనులా? అంటూ నెటిజన్లు కామెంట్స్​ చేస్తున్నారు.

– వెబ్​ డెస్క్​, ప్రభ న్యూస్​​

కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలం బంగారు గనులను తలపిస్తోంది. నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండిస్తోంది. ఇవ్వాల (గురువారం) హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూముల వేలం కొనసాగుతోంది. 6, 7, 8, 9 ప్లాట్లకు సంబంధించిన వేలంలో 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేస్తోంది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఈ వేలంలో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఒక ఎకరానికి అప్సెట్ ధర రూ.35 కోట్లుగా అధికారులు నిర్ణయించారు.

గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం వచ్చింది.  అప్పుడు కనిష్టంగా ఎకరా రూ.31 కోట్ల నుంచి అత్యధికంగా రూ.60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే పలికి ఏకంగా ఎకరం ధర రూ.85 కోట్ల వరకూ వేలంలో దూసుకెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఆదాయాన్ని మరోసారి ఆర్జించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

ప్రభుత్వం మాత్రం ఒక్కో ఎకరాకి 35కోట్ల అంచనా వేయగా.. మొత్తం 1500 కోట్లు వస్తుందని భావించారు. కానీ, ఈసారి ఆశించిన దానికంటే డబుల్​ రేట్ పలకడంతో ప్రభుత్వానికి 3వేల కోట్ల దాకా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈసారి భూముల వేలం ద్వారా 2500 నుండి రూ.3000 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని హెచ్ఎండిఏ ఆశిస్తోంది.

కోకాపెట నియో పోలిస్ భూములల్లో మల్టీపర్పస్ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉండడంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్‌కు ఉపయోగించుకునే అవకాశం ఉంది. భారీ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎయిర్​పోర్ట్​ కి, సిటీకి అత్యంత దగ్గరలో ఉన్న భారీ లేఅవుట్ కోకాపేట నియో పోలిస్ లేఅవుట్.. దీంతో డిమాండ్ భారీగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement