Tuesday, November 26, 2024

ఇక పాల‌మూరు ప‌చ్చ‌గా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. 12 వేల సాగు, తాగు నీటి ప్రాజె క్టును 50వేల ఎకరాలకు పెంచుతూ మధ్యతరహా ఎత్తిపోతల పథ కంగా మార్పు చేస్తూ రూ.567 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. 12వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 38,250 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరవు ప్రాంతంగా గుర్తింపు పొందిన పాల మూరు జిల్లాను పచ్చని పైర్లతో సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ పలు సాగునీటి ప్రాజెక్టులు ప్రధానంగా ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టుల పనులు ముమ్మరంగా సాగుతు న్నాయి. అందులో భాగంగా చేపట్టిన కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన అరకొర పనులు డిసెంబర్‌నాటికి పూర్తి చేసి, 50,250 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలకు తాగునీటిని సరఫరా చేయను న్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకొస్తే… కరువు కోరల్లో చిక్కుకున్న బీడు భూము లకు సాగునీరందుతుంది. తద్వారా పాల మూరు సస్యశ్యామలమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

సాలర్‌ జంగ్‌ సంస్కరణలో భాగాంగా ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1945లో నిర్మించిన ఈ ప్రాజెక్టు సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో కూరుకుపోగా తెలంగాణ ప్రభుత్వం దశలవారిగా పనులు చేపట్టి పాలమూరులో ఓ గొప్ప రిజర్వాయర్‌గా తీర్చిదిద్దుతున్నది. దేవరకద్ర బొల్లారం దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మించారు. దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంటలోని 12వేల ఎకరాల సాగు, తాగునీటి లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గతంలో పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో కేవలం సుమారు నాలుగున్నర ఎకరాల సాగునీటికి పరిమితం కావడంతో ప్రాజెక్టును విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది.

సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో 12వేల ఎకరాల నుంచి కేవలం నాలుగున్నర వేల ఎకరాలకు సాగునీటికి పరిమితమైన ఈ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరీకరించడానికి ప్రభుత్వం డీపీఆర్‌ రూపొందించి పనులు ప్రారంభించింది. 38,250 ఎకరాల కొత్తఆయకట్టుతోపాటు ఆరుతడి పంటలతో కలిపి 50,250 ఎకరాలకు కోయల్‌ సాగర్‌ మధ్యతరహా ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని ప్రతిపాదించి ప్రభుత్వం పనులు ప్రారంభించింది.

వర్షాభావ పరిస్థితుల్లో నీటి ప్రవాహం తగ్గితే జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణా నది నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన కాలువలు, మాెెటర్లను రాష్ట్ర ప్రభుత్వం బిగించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌ నుంచి రెండుదశల్లో 118 మీటర్ల ఎత్తువరకు కోయిల్‌ సాగర్‌ ప్రాజెెక్టు కోసం కృష్ణా జలాలను ఎత్తిపోసేందుకు సర్వం సిద్ధం చేసింది. కృష్ణా జలాల ట్రిబ్యునల్‌ కేటాయించిన 3.90 టీఎంసీల నీటని ఎత్తిపోయడానికి డీపీఆర్‌లో నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది. ప్రస్తు తం ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2.276 టీఎం సీలు ఉండగా ఈ సామర్థ్యాన్ని పెంచి కృష్ణాజలాల వాటాను ఉపయోగించు కునేందుకు పనులను ప్రారంభించింది.

- Advertisement -

ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సీడీఏ మధ్య తరహా సాగునీటి శాఖ జీవో ఆర్‌టీ నంబర్‌ 1658 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.359 కోట్ల పరిపాలనా అనుమతులు లభించాయి. ఆతర్వాత సవరించిన అంచనా మేరకు రూ.567 కోట్లు, అదనంగా రూ.157.11 కోట్లు కేటాయించింది. అయితే 2022-23లో 35,600 ఎకరాల ఆయకట్టుకు 2.908 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుత సంవత్సరం డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నిర్దిష్ట లక్ష్యాలను చేరుకునేందుకు సాగునీటి శాఖ కృషి చేస్తు ంది. ఇప్పటివరకు రూ.597 కోట్ల విలువైన పనులు జరిగాయి. ప్రతి పాదిత సామర్థ్యం 50,250 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా 35,600 ఎకరాల సాగునీటికి పనులు వేగంగా జరుగతున్నాయి. మరో 14,650 ఎకరాలకు సాగునీటిని డిసెంబర్‌ నాటికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. కరువుకోరల్లో చిక్కుకున్న బీడు భూము లకు రాష్ట్ర ప్రభుత్వం నీరందిస్తూ పాలమూరును పచ్చగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి క్రమేణ ఫలితాలు ఇస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement