అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు పై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు అంటూ చంద్రబాబు పై వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. పలుకుబడులు ఉపయోగించుకుని చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని చేసినా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. వచ్చే తిరుపతి, జెడ్పీ ఎన్నికల్లో చంద్రబాబు కి ప్రజలు బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు.ఈ రాష్ర్టంలో కాని, దేశంలో కానీ అత్యంత పిరికి వ్యక్తి ఎవరు అంటే ఆయనే చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవాచేశారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. ప్రజా కోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవు. ఎమ్మెల్యేగానూ నీకు ఓటమి తప్పదు. నీకు ఇల్లే జైలు అయిపోతుందంటూ చంద్రబాబుపై విజయసాయి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ”నీ మానిప్యులేషన్, మీడియా రాజకీయాలు నడవవు చంద్రబాబూ అంటూ ట్వీట్ చేశారు.
ఇక చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ లపై ఏపీ సిఐడి నమోదు చేసిన కేసులో విచారణ పై హైకోర్ట్ నాలుగువారాల స్టే విధించడంపై సుప్రీంకోర్టు ను ఆశ్రయించనుుంది ఏపీ సిఐడి. అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. అయితే సీఐడీ విచారణతో ఏకీభవించని హైకోర్టు.. ఈ కేసులో స్టే విధించింది. దీంతో ఇప్పుడు ఏపీ సిఐడి సుప్రీంని ఆశ్రయించనుంది.