Saturday, November 23, 2024

కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో ద‌శ విస్త‌ర‌ణ ప‌నులు -శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాని మోడీ

మెట్రో రైలు ప్రాజెక్టు రెండో ద‌శ విస్త‌ర‌ణ ప‌నుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ పొడిగింపు లో భాగంగా.. పేట నుంచి ఎస్ఎన్ జంక్షన్ మధ్య దూరం 1.8 కి.మీ. ఎలివేటెడ్ అర్బన్ రైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకరానున్నారు. ఇందుకోసం ప్ర‌భుత్వం రూ. 700 కోట్లను వెచ్చించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ యొక్క ఇంధన అవసరాలలో 55% సౌర విద్యుత్ ద్వారా అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. జేఎల్ఎన్ స్టేడియం నుండి ఇన్ఫోపార్క్ వరకు ఏర్పాటు చేయ‌నున్న కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు రెండవ దశకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయ‌నున్నారు. ఈ ద‌శ‌లో 11.2 కిలోమీటర్ల మేర నిర్మాణ ప‌నులు చేపట్ట‌నున్నారు.

ఇందులో 11 స్టేషన్లను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.1,950 కోట్లు గా అధికారులు పేర్కొన్నారు. విశేషమేమిటంటే.. మోడీ ప్రభుత్వం ప్రారంభించిన మెట్రో విప్లవంలో కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు ఒక భాగం. 2014లో దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో నెట్‌వర్క్ ఉంది. కానీ.. నేడు 20 నగరాలు మెట్రో సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. 2014లో దేశం మొత్తం మెట్రో నెట్‌వర్క్ పొడవు కేవలం 248 కి.మీ. కాగా… నేడు మెట్రో నెట్‌వర్క్ పొడవు 775 కి.మీలకు పెరిగింది. దీంతో పాటు మ‌రో 1000 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement