Thursday, November 21, 2024

Spl Story | పారాసిటమల్​తో డేంజరే.. డోసు మించితే ప్రాణ గండమేనట!

చీటికీ మాటికీ పారాసెటమాల్​ ట్యాబ్లెట్లు వాడుతున్నారా?.. అయితే మీ హెల్త్​ సిచ్యుయేషన్​ కాస్త డేంజర్​లో పడ్డట్టుగానే గమనించాలి. ఎందుకంటే అతిగా పారసెటమల్​ ట్యాబ్లెట్స్​ వాడేవారి లివర్​ దెబ్బతింటుంది. నిర్ణీత మోతాదును మించి తీసుకోవడం వల్ల మరణం కూడా సంభవించవచ్చని, మంచికంటే చెడు ఫలితాలే ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అది జ్వరం కావచ్చు, లేదా కాసింత పెయిన్​ అయినా కావచ్చు.. చాలామంది వెంటనే ఉపశమనం కోసం పారాసిటమల్​ ట్యాబ్లెట్స్​ని తీసుకుంటారు. ఎలాంటి పరిస్థితి అయినా.. అందరి ఇండ్లలో ఈ మెడిసిన్​ కామన్​గా ఉంటుంది. ఎలాంటి వ్యాధుల చికిత్స కోసం అయినా చాలా సంవత్సరాల నుండి సాధారణ ఔషధం మీద ఆధారపడి ఉంటున్నారు. – కానీ, ఇటీవల సాధారణ ఓవర్-ది-కౌంటర్ మెడిసిన్స్​ చాలామటుకు జనరల్​గా మారాయి.

శరీర తత్వాన్ని బట్టి వాటిని ఉపయోగించాలంటున్నారు డాక్టర్లు. ఏ కాస్త ఒళ్లు వేడిగా ఉన్నా, లేదా అనీజీగా ఫీల్​ అయినా సరే పారాసిటమల్​ మాత్రలు వేసుకునే వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. – దాని దీర్ఘకాలిక పరిణామాలను వారు తెలుసుకోకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు ట్యాబ్లెట్స్​ వేసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినడమే కాకుండా మరణం కూడా సంభవిచ్చని హెచ్చరిస్తున్నారు.

పారాసెటమాల్ ఎలా పని చేస్తుంది?

- Advertisement -

పారాసిటమల్​ డ్రగ్​ వివిధ పేర్లలో అందుబాటులో ఉంది. పేర్లు మారవచ్చు కానీ, అది ఎలా పని చేస్తుందో చాలా మందికి తెలియదు. ఇది మెదడులోని రసాయన ప్రక్రియను అడ్డుకుంటుందని, నొప్పి సంకేతాలను ఇస్తుందని డాక్టర్లు చెబుతన్నారు. దీంతో ఒంటి ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది. అయితే.. ఇక్కడ ఈ టాబ్లెట్ వాడడం వల్ల ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీంతో మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది.

పారాసెటమాల్ ఎలా ఉపయోగిస్తే మంచింది..

  • పిల్లలు, పెద్దలలో పారాసిటమల్​ని వేర్వేరుగా ఉపయోగించాలని వైద్య నిపుణులు అంటున్నారు.
  • 1. ప్రతి 4-6 గంటలకు 500mg 1 లేదా 2 మాత్రలు.
  • 2. పెద్దలు తప్పనిసరిగా 24 గంటల గ్యాప్‌లో 8 మాత్రలు తీసుకోవడం మానుకోవాలి.
  • 3. 16 ఏళ్లలోపు పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వాలి. అంతేకాకుండా వారి బరువు.. వయస్సును లెక్కలోకి తీసుకోవాలి.

PCMని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?

సిఫార్సు చేసిన మోతాదు కంటే అతిగా ఉపయోగించడం పారాసిటమల్​ని ఉపయోగించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీంతో కాలేయం దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. కాబట్టి సూచించిన పరిమితులకు తగ్గట్టు వాడుకోవాలి. తేలికపాటి నుండి మితమైన నొప్పి, జ్వరం, అసౌకర్యం ఉన్న సందర్భాల్లో పారాసెటమాల్ తీసుకోవచ్చు. అయితే.. అలెర్జీ లేదా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే పారాసెటమాల్‌ను ఆపేయడమే మంచిది. ఈ డ్రగ్​ విస్తృతంగా వాడకుండా డాక్టర్ అనుమతితోనే తీసుకోవాలి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement