Friday, November 22, 2024

DOST 2022: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం.. రేపటి నుంచి కాలేజీల ఎంపిక షురూ

డిగ్రీ కాలేజీల్లో చేరికల కోసం దోస్త్​ ఫేజ్​1 నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రేపటి నుంచి విద్యార్థులు తమ కాలేజీలను ఆన్​లైన్​లో ఎంచుకునే అవకాశం ఉంటుంది. పీజు చెల్లించి, ఆ తర్వాత నేరుగా వెళ్లి కాలేజీలో సర్టిఫికెట్స్​ సబ్మిట్​ చేసి అడ్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే సెకండ్​, థర్డ్​ ఫేజ్​లలో కూడా చాన్సెస్​ ఉంటుంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నాయి. బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం ఆన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. మూడు లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయడానికి తెలంగాణ స్టేట్​ కౌన్సిల్​ ఆఫ్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ (TSCHE) సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) TS దోస్త్ ఫేజ్ 1 సీట్ల కేటాయింపును ఆగస్టు 6న విడుదల చేయబోతోంది. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్‌ను వినియోగించుకున్న విద్యార్థులు సీటు కేటాయింపును తనిఖీ చేయడానికి దోస్త్ వెబ్‌సైట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో వారి అకౌంట్​లో లాగిన్ చేయవచ్చు.. హెల్ప్ డెస్క్ ఫేజ్ 1 సీట్ల కేటాయింపు రేపు (శనివారం) సాయంత్రం 7 గంటల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. (ఇక్కడ క్లిక్​ చేసి దోస్త్​ పేజీకి నేరుగా వెళ్లొచ్చు)

TS దోస్త్ ఫేజ్ 1 సీటు కేటాయింపు తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్..

- Advertisement -

విద్యార్థి సీటు కేటాయింపుతో సంతృప్తి చెందితే, కళాశాల ఫీజు లేదా సీటు రిజర్వేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆగస్ట్ 7 నుంచి 18వ తేదీ మధ్య  చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థి తాను సెలెక్ట్​ చేసుకున్న కళాశాలను సందర్శించి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కాగా, అక్టోబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

TS దోస్త్ దశ 2 నమోదు..

టీఎస్ దోస్త్ ఫేజ్ 1 అలాట్‌మెంట్‌తో సంతృప్తి చెందని వారు ఫేజ్ 2 కోసం రిజిస్ట్రేషన్ ఫీజు 400 చెల్లించి నమోదు చేసుకోవచ్చు.. దశ 2 రిజిస్ట్రేషన్ ఆగస్టు 7 మరియు 21 మధ్య ఉండనున్నాయి. వెబ్ ఎంపికను ఆగస్టు 22 వరకు ఉపయోగించుకోవచ్చు. ఇక.. టీఎస్ దోస్త్ ఫేజ్ 2 కేటాయింపు ఆగస్టు 27న ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఫేజ్ 3 కూడా తర్వాత జరుగుతుందని అధికారులు తెలిపారు.

ముఖ్య సమాచారం:
https://dost.cgg.gov.in/

  • ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థుల సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
  • ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్‌
  • ఆగస్టు 7 నుంచి 22 వరకు రెండో విడత వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • ఆగస్టు 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు మూడో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్‌
  • ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు మూడో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం
  • సెప్టెంబర్‌ 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • అక్టోబర్‌ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
Advertisement

తాజా వార్తలు

Advertisement