కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లులపై తనిఖీలకు ఆదేశించారు. రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయాలని ఎఫ్ సీఐకి ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి కేంద్రం సమావేశాలు నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. కేంద్రప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రానికో విధానం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బియ్యాన్ని కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో గోనె సంచుల కొరత ఉందన్నారు. తూకం వేసే పరికరాలు లేవన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement