మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తాను ఈటలను కలవలేదని, ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. అందరినీ కలిసినట్లే నన్నూ కలుస్తానని ఈటల చెప్పారన్నారు. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతానని వెల్లడించారు.
ఈటల రాజేందర్‌ను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదని చెప్పారు. హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తే పోటీ చేయాలా లేదా అనే విషయాన్ని అధిష్ఠానంతో చర్చించలేదన్నారు. అసెంబ్లీలో ఈటలతో కలసి 15ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.
ఇక, బీజేపీలో గ్రూపులు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఎలా తెలుసు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్లను దేవుడే చూసుకుంటాడన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి ఖచ్చితంగా సాయం చేస్తానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజీనామా చేసేందుకు సిద్దం అని స్పష్టం చేశారు. అయితే, ఆయన కొత్త పార్టీ పెడుతా? లేక ఇతర పార్టీలో చేరుతారా? అన్నదానిపై స్పష్టం లేదు. ఇప్పటికే ఆయన బీజేపీ, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలువడం.. తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు చెందిన ఒక్కో నేతను ఈటల కలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరతారని కేంద్రమంత్రితో సంప్రదింపులు జరిపారని రూమర్స్ వినిపించాయ.
ఇది కూడా చదవండి: కేటీఆర్ సారూ… ప్రైవేట్ ఆస్పత్రులపై నోరు విప్పరా?