తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రశంసించారు ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య. ఆర్టీసీ ఇస్తున్న సేవలను ఆయన అభినందించారు. అంతేకాదు ఆర్టీసీ బస్సుపై తనదైన శైలిలో పాట కూడా ఆలపించారు. విషయం ఏంటంటే.. మొగులయ్య తన కూతురు పెళ్లికి ఇటీవల ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తం చేస్తూ తాను అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెరతో పాటను ఆలపించారు. బుక్ చేసిన గంటలోనే బస్సు వచ్చిందని.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందని పాట రూపంలో పాడారు. పెండ్లికి సురక్షితంగా వెళ్లి వచ్చామని చెప్పారు. అది ఆర్టీసీ బస్సు కాదని.. తల్లిలాంటిదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..