Saturday, November 23, 2024

కైనెటిక్ లూనా మళ్లీ వచ్చేస్తోంది..

ఇండియాలోకి కైనెటిక్ లూనా మరోసారి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈసారి లేటెస్ట్ గా ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా ఎల‌క్ట్రిక్ ఫీచ‌ర్ల‌తో, అప్ప‌టి ల్యూనాకు త‌గ్గ‌ట్టుగా దీనిని ఉత్ప‌త్తి చేయ‌బోతున్నారు. . కాగా, ఇప్పుడు మ‌రోసారి ఈ లూనాల‌ను విప‌ణిలోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధం అవుతున్న‌ది. ఎల‌క్ట్రిక్ వాహ‌నం అయిన్ప‌టికి దీని ధ‌ర త‌క్కువ‌గానే ఉండ‌బోతున్న‌ట్టు కంపెనీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. ఒక‌సారి చార్జింగ్ చేస్తే 60 కిమీ దూరం వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ల్యూనా 25 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం చేస్తుంది కాబ‌ట్టి లైసెన్స్ అవ‌స‌రం లేదు. ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌తో ఈ ఏడాది ఈ లూనాను విప‌ణిలోకి విడుద‌ల చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే దీని ధ‌ర‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

90 ద‌శ‌కంలో కైనెటిక్ లూనా ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సామాన్యుల‌కు సైతం ఈ లూనాలు అందుబాటులో ఉండేవి. పెట్రోల్ అయిపోయిన‌పుడు సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లిపోవ‌చ్చు కూడా. అయితే, ద్విచక్ర‌వాహ‌నాల్లో వ‌చ్చిన మార్పులు, చేర్పుల కార‌ణంగా కైనెటిక్ లూనా నిల‌బ‌డ‌లేక‌పోయింది. 2000 నుంచి ఈ లూనా ఉత్ప‌త్తిని కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి లూనా ఎంత సక్సెస్ అవుతుందో మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

ఇది కూడా చదవండి:ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement